గతుకు రోడ్లు పోయాయి
అన్నా కాంటీన్లు పునరుద్ధరిస్తాం
ఎలక్ట్రికల్ వెహికల్ కు వెళ్దాం
ఆటోడ్రైవర్ల సేవలో.. సీఎం చంద్రబాబు

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : రోడ్డు – అధ్వాన్నంగా తయారైనా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు – గతుకుల రోడ్లపై డ్రైవర్లు చాలా ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి. – ప్రయాణాలకు ఇబ్బంది లేదు. – ఉచిత ప్రయాణ సౌకర్యంతో మంహిళలు సంతోషంగా ఉన్నారు – ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి – ఆటో డ్రైవర్లంటే చాలామంది పేదవాళ్లే ఉంటారు – ఏడాదికి రూ. 15 వేలు ఇస్తే.. వారికి కొంత ఊరటగా ఉంటుంది, అందుకే ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నాం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతముందు ఉండవల్లి నుంచి ఆటోలో సీఎం సింగ్ నగర్ కు చేరుకున్నారు.

ఇక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, **2024 ఎన్నికలు నా చరిత్రలో ఎప్పుడూ చూడనిది – 94 శాతం స్ట్రెక్ రేట్ తో గెలిపించారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మరిన్ని మంచి పనులు చేస్తోంది. 15 నెలల మా పాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచి ఆదుకుంటున్నాం. పింఛన్ల కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వమిది. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం ఎత్తేసింది. కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటిన్లను పునరుద్ధరించాం. విజయవాడలో అన్నీ వెహికల్స్ సీఎన్ జీకి మార్చడం సంతోషం. రాబోయే రోజుల్లో సీఎన్ జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వెళ్లాం. యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్ తో అందరినీ ఆదుకుంటాం. పేదల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నాం. రూ.25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం.. మంచి చేయడమే మా పని.

దేశంలోనే మొదటి సారిగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలు నేరుగా అందిస్తున్నాం. సాంకేతికతను పేద ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం. సంపద సృష్టిస్తున్నాం. సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోంది. జీఎస్టీ 02 ద్వారా సూపర్ సేవింగ్స్. దసరా, దీపావళి, సూపర్ సిక్స్, సూపర్ జీఎస్టీ, జీఎస్టీ సంస్కరణల ద్వారా ధరలు బాగా తగ్గిపోతున్నాయి. గత ఐదేళ్ల విధ్వంసం నా జీవితంలో చూడలేదు. దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి శూన్యం. దుష్టశక్తులు రాకుండా ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోంది** అని సీఎం చంద్రబాబు అన్నారు.



