CM | చంద్రబాబుకి అంబటి క్షమాపణ చెప్పాలి

CM | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చేసిన వాఖ్యలు పై అవనిగడ్డ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… అంబటి వాఖ్యలు సరైనవి కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అచ్చోసిన ఆంబోతులా మాట్లాడిన తీరు మహిళలతో చెప్పుతో కొట్టించుకునే పద్దతిగా ఉందన్నారు.

ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని 11 సిట్లకే అంకితం చేసారని, ఐనా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గాని, మాజీ మంత్రులకు గాని అసలు సిగ్గు శరం ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుల్ని రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలన్నారు. అంతేకాకుండా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply