Clinic | ఆర్ ఎంపి పై కేసు నమోదు….

Clinic | ఆర్ ఎంపి పై కేసు నమోదు….

Clinic | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణంలో అనుమతులు లేకుండా ఆర్ ఎం పి నిర్వహిస్తున్న క్లినిక్ ను ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిజ్ చేశారు. కుమ్మనపల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి బోధన్ పట్టణంలో క్లినిక్ నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నాడు.

ఎటువంటి అర్హత లేకపోయినా నరసింహారెడ్డి వైద్యం చేయడం పట్ల పలు ఫిర్యాధులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమంతలు పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లలో చికిత్సలు పొంది ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు. తనిఖీల సందర్భంగా బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణతో పాటు డాక్టర్ శేఖర్, రవి నిర్మల ఉన్నారు.

Leave a Reply