ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14న ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు ముగుస్తాయి.పదవ తరగతి పరీక్షలు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 9:30 గంటలకు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించరు.ఉదయం 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రానికి అనుమతించరు.విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.
