తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..

తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు.

పదవ తరగతి పరీక్షలు షురూ

వేల్పూరు, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బంధంగా బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని ఎంఈఓ రేణుక పేర్కొన్నారు.శనివారం రోజున మొదలైన పదవ తరగతి పరీక్షలు ప్రారంభం వేల్పూర్ మండలంలో 533 మంది విద్యార్థులకు గాను ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రానికి 533 మంది రావాల్సి ఉండగా 531 మంది మాత్రమే పరీక్ష రాయడానికి హాజరయ్యారని అలాగే పడగల్ పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు గైహాజరయ్యారని ఎంఈఓ రేణుక తెలిపారు. పరీక్ష హలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారాని నేటినుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 16 వ తేది వరకు జరగనున్నాయి.

ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం. 12:30 వరకు పరీక్షల సమయం వుంటుంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనె నిబంధనలు ఉండగా 5 నిమిషాలు గ్రేస్ సమయాన్ని ఇచ్చారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాఫియింగ్ అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు సిట్టింగ్ స్కాడ్ తో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని ఆమె సూచించారు.పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీల అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎస్సై సంజీవ్ ఆధ్వరంలో పరీక్ష కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

========================================================

ఊట్కూర్ లో ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు- ఎంఈవో

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం నిర్వహిస్తున్న పదవ తరగతివార్షికపరీక్షలు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండలంలో నిర్వహించిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో శనివారం విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో తెలుగుపరీక్షలు రాశారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారిని మాధవి పరిశీలించారు. మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో 558 విద్యార్థులకు గాను ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు గైరాజరయ్యారు.


ఊట్కూర్ జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో 128 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి గైరాజరు కాగా బాలికగా ఉన్నత పాఠశాలలో 125 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి పరీక్షలకు గైరాజరైనట్లు ఎంఈఓ మాధవి తెలిపారు. పులిమామిడి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో148మంది విద్యార్థులకు గాను 100 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 137 మంది విద్యార్థులకు గాను 100 శాతంవిద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం రావడంతో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు విద్యార్థి సంఘాల నాయకులు యువకులు , పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో వ్రాయాలని మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఆయా పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందం పరిశీలించినట్లు ఎంఈఓ తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపర్డెంట్లు సుధీర్, కిషోర్ కుమార్, నర్సిములు, సత్యనారాయణ, డిపార్ట్మెంటల్ అధికారులు మహేష్, భాస్కర్ సత్యనారాయణ, అశోక్ తో పాటు పలువురు అధికారులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించారు.

================================================================

పది పరీక్షలు ప్రారంభం


సంస్థాన్ నారాయణపురం,ఆంధ్రప్రభ : మొదటిరోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 402 మంది విద్యార్థులు 3 సెంటర్లలో 402 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. 100% విద్యార్థులు అందరూ పరీక్షకు హాజరయ్యారని పరీక్ష కేంద్రాల ను పరిశీలించి సందర్శించారు.

===========================================================================

ప్రారంభమైన పదవతరగతి పరీక్షలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : నేటినుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి.దండేపల్లి మండలంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.దండేపల్లి పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో 154 మంది విద్యార్థులకు 154 మంది పరీక్ష రాశారు, లింగపూర్ ఆదర్శ పాఠశాల లో 199 మంది విద్యార్థులకు 199మంది పరీక్షలు రాసినట్లు మండల విద్యాధికారి మంత్రి రాజు తెలిపారు, పరీక్షల గదులల్లో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.నేటినుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 16 వ తేది వరకు జరగనున్నాయి.

ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం. 12:30 వరకు పరీక్షల సమయం ఉంటుందని అన్నారు.విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనె నిబంధనలు ఉండగా 5 నిమిషాలు గ్రేస్ సమయాన్ని ఇచ్చారు.పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాఫియింగ్ అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు తో పాటు సిట్టింగ్ స్కాడ్ తో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీల అనుమతి లేదని,పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ నిర్వాహకులకు సూచించారు.

==================================================================

పది పరీక్షలు ప్రారంభం,

మొదటి తెలుగు పరీక్షకు ఇద్దరు గైర్హాజర్,

చిట్యాల, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి .పది పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్ కు, ఇద్దరు విద్యార్థులుగైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. మండల కేంద్రంలో జడ్పీఎస్ ఎస్ హై స్కూల్ ,150 మంది గాను ఇద్దరుగైర్హాజరయ్యారు. టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ (జి) వెలుగు గురుకులంలో 128 మంది పరీక్షలు రాశారు, రెండు పరీక్ష కేంద్రాలలో మొత్తం 278 మంది విద్యార్థులు. పది పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈఓ రఘుపతి తెలిపారు .

===========================================================================

ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

51 మంది విద్యార్థులు గైర్హాజరు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప ఉదయం 9.30 గంటలకు అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్షలు సమయానికి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 24,404 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

అందులో 24,353 మంది విద్యార్థులు హాజరుకాగా, 51 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన ఎలాంటి వదంతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల సరఫరాలో కూడా ఎలాంటి లోటు లేకుండా అన్ని కేంద్రాలకు సమయానికి చేరినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం జరగలేదని పేర్కొన్నారు.


జిల్లాలో ఏర్పాటుచేసిన 144 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలను పర్యవేక్షించాయి. అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 52 కేంద్రాలను తనిఖీ చేయగా, ఏసీజీఈ అధికారులు 6 కేంద్రాలను పరిశీలించారు.పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ఇన్విజిలేటర్ల కొరత కూడా ఎక్కడా తలెత్తలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా సాగిందని జిల్లా విద్యాధికారి పి అశోక్ పేర్కొన్నారు.

==========================================================

Leave a Reply