Civil Supply | కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Civil Supply | కొనుగోళ్లను వేగవంతం చేయాలి
Civil Supply | ప్రతినిధి/ యాదాద్రి, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ రోజు జిల్లాలోని పోచంపల్లి మండలం జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, కొనుగోలు చేసినంత వరకు టాబ్ ఎంట్రీ(Tab entry) మొత్తం పూర్తి చేశారా అని ఆరా తీశారు. లారీలు లోడ్ చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు. రెండు రోజుల్లో కేంద్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు.
జూలూరు పీఏసీఎస్(Juluru PACS) పరిధిలో కప్రయిపల్లి, పెద్ద గూడెంలో సరిపడా లారీలు లేక కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ ఉందని కేంద్రం నిర్వాహకులు తెలుపడంతో వెంటనే సంబధిత సివిల్ సప్లై అధికారుల(Civil Supply Officers)కు ఫోన్ చేసి కప్రాయిపల్లికి 4 లారీలు, పెద్ద గూడెం కేంద్రానికి 3 లారీలు వెంటనే పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లారీలలో లోడ్ చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
