సిటీ బ‌స్సు ఛార్జీల పెంపు..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని సిటీ బస్సు ప్రయాణికులపై టీజీఎస్ ఆర్టీసీ భారం మోపింది. టికెట్ ఛార్జీలను పెంచాలని సంస్థ‌ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ కొత్త ఛార్జీలు ఎల్లుండి (అక్టోబర్ 6వ తేదీ) నుంచి అమలులోకి రానున్నాయి.

పెరిగిన కొత్త ఛార్జీల వివరాలు..
ఆర్టీసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సిటీ బస్సుల ఛార్జీలు మొదటి మూడు స్టేజీల వరకు ఉన్న టికెట్లపై రూ.5 పెంచారు. నాలుగో స్టేజీ నుంచి ఆపైకి ఉన్న టికెట్లపై రూ.10 చొప్పున పెంచారు. ఇటీవల కాలంలో ఇంధన ధరలు పెరగడం, బస్సుల నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఛార్జీల పెంపు నగరంలోని సాధారణ ప్రయాణికులకు, విద్యార్థులకు భారంగా మారే అవకాశం ఉంది.

Leave a Reply