లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి

లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి

బూడిద గణేష్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు.

మంథని టౌన్, ఆంధ్రప్రభ : కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పేర్కొన్నారు. సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ఇచ్చిన బ్లాక్ డే పిలుపులో భాగంగా బుధవారం మంథని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డ్ లు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, వాటిని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుందని అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్ ల పై అసెంబ్లీ చర్చించి లేబర్ కోడ్ ల ను రాష్ట్రంలో అమలు చేయమని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేష్ సింగారపు గట్టయ్య రాజయ్య పోచమ్మ దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply