ఇబ్రహీంపట్నంతో అనుబంధం మరవలేనిది

ఇబ్రహీంపట్నంతో అనుబంధం మరవలేనిది

అభినందన వీడ్కోలు సభలో సీఐ చంద్రశేఖర్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నంతో ఏర్పడిన అనుబంధం మరువలేనిదని సీఐ ఎ. చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ స్పెషల్ బ్రాంచి సీఐగా బదిలీ అయిన చంద్రశేఖర్ అభినందన వీడ్కోలు సభ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం వచ్చిన మొదట్లో కొంత ఇబ్బందికి గురైనా అందరి సహకారంతో విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసినట్లు తెలిపారు.

తన పదవీ కాల సమయంలో అనేక సంఘటనలు జరిగినా వీలైనంత త్వరగా కేసులు పరిష్కారం జరిగాయన్నారు. స్టేషన్ సిబ్బంది, రాజకీయ ప్రముఖులు, మీడియా, ప్రజలందరి సహకారంతో పదవీకాలంలో అనేక కఠిన సమస్యలు ఎదుర్కొన్నా విజయవంతంగా పరిష్కారం చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఐ చంద్రశేఖర్ ను పోలీస్ సిబ్బంది దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. నూతన సీఐ ఎ.సుబ్రహ్మణ్యంకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్సైలు సేనాపతి శ్రీనివాసరావు, బోనగిరి రాజు, పురుషోత్తం, చక్రధర్, సత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply