Christmas | శుభాకాంక్షలు..

Christmas | శుభాకాంక్షలు..
Christmas, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపమని, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, అందరూ బాగుండాలని వారు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు – మంత్రి కొల్లు రవీంద్ర
క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర నేడు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతి, సౌబ్రాతృత్వం ప్రబోధించిన ఏసుప్రభువు అందరికీ ఆదర్శప్రాయం అని మంత్రి పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను అందరూ సోదర భావంతో కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు.

