Christmas celebrations | ప్రభువు దీవెనలతో ఎదగాలి

Christmas celebrations | ప్రభువు దీవెనలతో ఎదగాలి

  • కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్
  • కల్వరి చర్చిలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు
  • వేలాదిమంది క్రైస్తవులతో కిటకిటలాడిన ప్రాంగణం
  • వేడుకల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్
  • చిన్నారుల నృత్యాలు, గీతాలతో ఆధ్యాత్మిక సందడి

Christmas celebrations | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఏసు ప్రభువు జన్మదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో ఈ రోజు క్రిస్మస్ వేడుకలను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. వేలాదిమంది క్రైస్తవ విశ్వాసులు హాజరుకావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు, నృత్యాలతో క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి నిర్వాహకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. చిన్నారులు ప్రదర్శించిన క్రిస్మస్ నాట్యాలు, గీతాలు భక్తులను విశేషంగా అలరించాయి. యేసు జన్మకథను ప్రతిబింబించే నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా కల్వరి మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ… పేద ప్రజలంతా ప్రభువు దీవెనలతో అంచలంచెలుగా ఎదగాలన్నారు. నిరాశలో ఉన్నవారికి క్రిస్మస్ ఆశను నింపుతుందని అలాగే బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఏసు ప్రభువు పేదల పక్షాన నిలబడ్డాడని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి అన్నం, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు, అణగారిన వారికి న్యాయం అందించడమే ఆయన బోధన అని అన్నారు. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాదని, అది ప్రేమ, క్షమ, సేవ, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

వేడుకల అనంతరం పేదలకు, అనాథలకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్వరి చర్చిలో జరిగిన ఈ క్రిస్మస్ సంబరాలు బెల్లంపల్లి పట్టణంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. విశ్వాసుల ప్రార్థనలు, ఆనందోత్సాహాలతో బెల్లంపల్లిలో క్రిస్మస్ వెలుగులతో వెలిగిపోయింది.

Christmas celebrations | ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది : మంత్రి

క్రిస్మస్ శాంతి, ఐక్యతకు ప్రతీక అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. బెల్లంపల్లి కల్వరి చర్చిలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు.

Christmas celebrations | ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి : కలెక్టర్

క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, ప్రేమ, వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాధ రెడ్డి, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మ‌న్ ముత్తినేని రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ జెడ్పీటీసీ కార్కూరి రాంచందర్, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ఐటీ డీఏ రిటైర్డ్ చీఫ్‌ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, బుచ్చయ్యపల్లి గ్రామ సర్పంచ్ జాడి మహేష్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు ముత్తే భూమయ్య, కనకరాజు, మునిమంద రమష్, మత్తమారి సూరిబాబు పాల్గొన్నారు.

Leave a Reply