Christian leaders | పాస్టర్ల ముసుగులో రాజకీయం వ‌ద్దు

Christian leaders | పాస్టర్ల ముసుగులో రాజకీయం వ‌ద్దు

  • ప్యాకేజీ తీసుకుని ఎమ్మెల్యే పై విమర్శలు చెయ్యొద్దు
  • సెల్ టవర్ ఎక్కిన వారిపై ఆగ్రహం
  • ఎమ్మెల్యేకి ఎస్సీ, బీసీలు అండగా ఉంటారు
  • ధర్మాపురం గ్రామస్తులు

Christian leaders | ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణం శనివారం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వారిపై ఆకివీడు పట్టణం ధర్మాపురం అగ్రహార గ్రామంలో ఎస్సీ, క్రైస్తవ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మాపుర అగ్రహార గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కొంతమంది తమ గ్రామం పరువు తీస్తున్నారంటూ ధర్మాపుర అగ్రహారం కౌన్సిలర్ జాన్ వెస్లీ స్పష్టం చేశారు. గ్రామంలో మంచినీటి చెరువు ఆక్రమణ గురై వ్యర్ధాలు కలవడం వలన అనారోగ్యానికి గురవుతున్నామని, అనేక సంవత్సరాలుగా పోరాడిన ఫలితంగా అధికారులు ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

అప్పుడు కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లిన కోర్టు వారి పిటిషన్లు కొట్టివేస్తూ తొలగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో తెలియట్లేదన్నారు. మేము కూడా దళితులమేనని, ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, అంతేగాని ప్యాకేజీలు తీసుకుని స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పై ఆరోప‌ణ‌లు చేస్తే మర్యాదగా ఉండదని వెలగపూడి అబ్బులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ బాబుకు గతంలో హైదరాబాద్‌లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని, ఎమ్మెల్యే పై మరోసారి తప్పుడు మాటలు మాట్లాడితే స‌హించేది లేద‌ని హెచ్చరించారు.

కేవలం వారి సొంత ప్రయోజనాల కోసమే ఈ రకంగా సెల్ టవర్లు ఎక్కుతున్నారని, టవర్ ఎక్కితే దళితులంటున్నారని, చర్చి దగ్గరకు వస్తే క్రిస్టియన్లు అంటున్నారని, మీ రాజకీయాల కోసం దళితులను బలి చేయొద్దని మద్దా నరేష్ తెలిపారు. పాస్టర్ల ముసుగులో రాజకీయ నాయకుల కన్నా దారుణంగా మాట్లాడుతున్నారని, నీ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో తమకు తెలుసని, ఆ వ్యక్తి పీవీ సునీల్ కుమార్ అని ఆరోపించారు. పీవీ సునీల్ కుమార్ కావాలని కుట్రపూరితంగా ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

రఘురామకృష్ణరాజు క్రైస్తవ పాఠశాలలో విద్యాబోధన చేశారని, ఉండి నియోజకవర్గంలో వారు అందరినీ సమానంగా చూస్తుంటే.. ఈ రకంగా మాట్లాడటానికి సిగ్గుండాలంటూ గూడపాటి పమ్ము విరుచుకుపడ్డారు. ఈ గ్రామంలో కౌన్సిలర్లు పెద్దలు నాయకులు ఉన్నారని, పాస్టర్ల మంటూ కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఎందుకు కల్పించుకుంటున్నారని ధీన రాజు ప్రశ్నించారు. వారికి రాజకీయం చేయాలనుకుంటే పాస్టర్ ముసుగు తీసేసి రాజకీయల్లోకి రావాలని సూచించారు. ఇప్పటికైనా ఈ విషయానికి స్వస్తి పలకాలని, మా గ్రామాన్ని అల్లరి చేయొద్దంటూ గ్రామస్తులు వారిని కోరుతున్నారు.

Leave a Reply