Choutuppal | స్వామి గౌడ్ అంతిమ యాత్రలో రాజగోపాల్ రెడ్డి..

Choutuppal | స్వామి గౌడ్ అంతిమ యాత్రలో రాజగోపాల్ రెడ్డి..

Choutuppal, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని మామ మొగుదాల స్వామి గౌడ్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగుదాల రమేష్ గౌడ్ నివాసానికి వెళ్లి స్వామిగౌడ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ లను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన స్వామి గౌడ్ అంతిమయాత్రలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, వివిధ పార్టీల నాయకులు, బంధు, మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply