Choutuppal | కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి…

Choutuppal | కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి…
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఐ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్టుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రకటించారు. చౌటుప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్, సీపీఐ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఐ పార్టీకి ఒక కో- ఆప్షన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన అంగీకారాన్ని తెలిపారని, చౌటుప్పల్ మున్సిపాలిటీలో సిపిఐ కార్యకర్తలు సంపూర్ణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారి గెలుపు కోసం కృషి చేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ మునుగోడు ఎన్నికల ఇన్చార్జి పబ్బురాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, సందగళ్ళ విజయ సతీష్ గౌడ్, నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్, సీపీఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, మండల, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, సుర్వి నరసింహ, సీపీఐ నాయకులు ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్,, కేతరాజు నర్సింహ బోయ మంకులు, బద్దుల సుధాకర్, నీళ్ల బిక్షపతి, టంగుటూరు రాములు తదితరులు పాల్గొన్నారు.
