ఆందోళనలో చిట్యాల రైతులు..

ఆందోళనలో చిట్యాల రైతులు..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో సోమవారం రాత్రి వీచిన గాలి దుమారానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో బాధిత చిట్యాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రైతులు యాసంగిలో మొక్కజొన్న పంట వేసి, ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర చేసి, గాలి వానతో మొక్కజొన్న పంట నెల కోరినట్లు బాధిత రైతులు వీరవీణ సతీష్, వీరవేణ గణేష్, కొత్తకొండ రాజు, కొత్తకొండ సతీష్, ముగలరాజు, తోట ప్రసాద్ తదితరుల 100 ఎకరాల మొక్కజొన్న పంట నేల కోరినట్లు రైతులు తెలిపారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, స్పందించి, బాధిత రైతుల పంటలు సర్వే చేసి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

