Badminton | 27 నుంచి చైనా టోర్నమెంట్.. వైదొలిగిన సాత్విక్-చిరాగ్ జోడీ !

చైనా : BWF సుదిర్మాన్ కప్ 2025 ఈ నెల 27 నుండి మే 4 వరకు చైనాలోని జియామెన్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నమెంట్‌లో దాదాపు 16 దేశాలు పాల్గొంటుండగా.., భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

సుదిర్మాన్ కప్ కోసం భారతదేశం తన 14 మంది సభ్యుల జట్టును ప్రకటించ‌గా.., కానీ కీలక ఆటగాళ్లు, ప్రపంచ 11వ ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ జోడీ టోర్నమెంట్ కు దూర‌మైంది.

ముందుగా ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో భారతదేశం తరపున పురుషుల డబుల్స్ ఆడాల్సిన సాత్విక్ – చిరాగ్ జోడీ… అనారోగ్యం కారణంగా BWF సుదిర్మాన్ కప్ 2025 నుండి వైదొలిగినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

అయితే, అసోసియేషన్ సాత్విక్ – చిరాగ్ జోడీ స్థానంలో వేరే డబుల్స్ జోడీ తీసుకోలేదు, దీంతో టోర్నమెంట్ కోసం ముందుగా ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టును 12 కి తగ్గించింది.

సాత్విక్ – చిరాగ్ వైదొలగడంతో.. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారతదేశం తరపున పోటీ పడుతున్న ఏకైక జంట హరిహరన్ అంసకరుణన్ – రూబన్ కుమార్.ఆర్ నిలిచారు.

టోర్నమెంట్‌లో గ్రూప్ డిలో ఉన్న భారత్.. మాజీ ఛాంపియన్స్ ఇండోనేషియా, రెండుసార్లు రన్నరప్ డెన్మార్క్, ఇంగ్లాండ్‌లతో పోటీపడుతుంది. ఈ కఠినమైన లైనప్‌ను అధిగమించి ముందుగా తమ నాకౌట్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ చూస్తుంది.

గ్రూప్ ఏ లో : చైనా, థాయిలాండ్, హాంకాంగ్, అల్జీరియా.
గ్రూప్ బి లో : కొరియా, చైనీస్ తైపీ, కెనడా, చెకియా.
గ్రూప్ సి లో : జపాన్, మలేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా.

సుదీర్‌మన్ కప్ కోసం భారత జట్టు :

  • పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్.
  • మహిళల సింగిల్స్: పివి సింధు, అనుపమ ఉపాధ్యాయ.
  • పురుషుల డబుల్స్: హరిహరన్ అంశకరుణన్ – రూబన్ కుమార్ ఆర్.
  • మహిళల డబుల్స్: ప్రియా కొంజెంగ్బామ్ – శ్రుతి మిశ్రా.
  • మిక్స్‌డ్ డబుల్స్: ధ్రువ్ కపిల – తనీషా క్రాస్టో, సతీష్ కుమార్ కరుణాకరన్ – అధ్యా వారియత్.

Leave a Reply