న్యూ ఢిల్లీ – భారత్, పాక్ ఉద్రిక్తతలపై చైనా స్పందించింది.. తాము ఉగ్రవాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. రెండూ ఒకరికొకరు పొరుగు దేశాలని, , ఆ ఇద్దరూ చైనాకు పొరుగువారంటూ చైనా ప్రకటించింది . విస్తృత ప్రయోజనాల కోసం శాంతి మార్గం అనుసరించాలని సూచించింది. యుఎన్ చార్టర్ సహా అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని కోరింది. యుద్దం ఎప్పుడూ పరిష్కారం కాదని హితవు పలికింది. ఇరుదేశాలు ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని చైనా సూచించింది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించడానికి, నిర్మాణాత్మక పాత్ర పోషించానికి, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.
China Respond | ఉద్రిక్తత తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి రెడీ – చైనా
