China Open | లక్ష్య సేన్ ఔట్.. రెండో రౌండ్‌కి ప్రణయ్ !

చైనా ఓపెన్ (China Open) సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ హెచ్‌.ఎస్‌. ప్రణయ్ (H.S. Pranay) అరుదైన పోరాటంతో రెండో రౌండ్‌కి చేరగా, లక్ష్య సేన్ (Lakshya Sen) నిరాశ చెందాడు.

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ప్రణయ్, జపాన్‌కి చెందిన కోకి వటానాబేతో జరిగిన మ్యాచ్ లో 8-21, 21-16, 23-21 తేడాతో ఘన విజయాన్ని సాధించాడు.

మ‌రోవైపు లక్ష్య సేన్ పరాజయాలు కొనసాగించేశాడు. మొదటి గేమ్ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, చైనా ఐదవ సీడ్ లీ షి ఫెంగ్‌తో 21-14, 22-24, 11-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

మహిళల సింగిల్స్ లో కూడా అనుపమ ఉపాధ్యాయ్ నిరాశపరిచారు. ఆమె చైనీస్ తైపీకి చెందిన లిన్ జియాంగ్ టి చేతిలో 23-21, 11-21, 10-21 తేడాతో ఓడిపోయింది. మిక్స్ డ్ డబుల్స్ లో భారత జోడి ఎ. సూర్య – ఎ ప్రముతేష్ & రోహన్ కపూర్ – రుత్విక గద్దె తొలి రౌండ్ లోనే ఓడిపోయారు.

Leave a Reply