China | ఆగ్రికల్చరల్‌ టెర్రరిజమ్‌.. అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తలు అరెస్ట్

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని కబళించిన కరోనా వైరస్‌ను మనం ఇంకా మరచిపోలేదు. కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలుదేశాలు నమ్ముతున్నాయి.. ఇప్పుడు తాజాగా అమెరికాలో అగ్రిక‌ల్చ‌ర్ టెర్ర‌రిజానికి చైనా అడుగులు వేస్తున్న‌ది.. ఈ నేప‌థ్యంలోనే ఎఫ్ బి ఐ అధికారులు ఇద్ద‌రు చైనా శాస్త్ర‌వేత్త‌ల‌ను అరెస్ట్ చేశారు.. వారి నుంచి అత్యంత ప్ర‌మాద‌కారి అయిన ఫంగ‌న్ ను స్వాధీనం చేసుకున్నారు..

ఈ వివ‌రాల‌ను అధికారికంగా ఎఫ్ బి ఐ డైరెక్టర్‌ కశ్యప్‌ పటేల్ వెల్ల‌డించారు. ప్రమాదకర ఫంగస్‌ను స్మగ్లింగ్‌ చేశార‌నే అభియాగాల‌పై జియాన్‌, లియుని అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. అరెస్టయిన చైనీయుల ద్గగర ఫుసారియమ్‌ గ్రామినేరమ్‌ అనే ఫంగస్‌ ఉన్నట్లు తెలిపింది. ఇది ఆగ్రికల్చరల్‌ టెర్రరిజమ్‌ ఆయుధం అంటూ అమెరికా వెల్ల‌డించింది. మిషిగన్‌ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ప్రస్తుతం శాంపిళ్లను తరలించారు.

వ్య‌వ‌సాయ ఉత్ప‌తులు మ‌టాష్…
ఈ ప్రమాదకర ఫ్యాథోజన్‌ వల్ల ఏం జరగబోతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది.. చైనా ఫంగస్‌ ఏం చేస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలపై ఈ ఫంగస్‌ దాడి చేస్తుంది. ఈ ఫంగస్‌ హెడ్‌ బ్లైట్‌ అనే వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా మనుషులు, పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్‌తో ఆర్థిక విధ్వంసం సాగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. పంట‌ల పండే అవ‌కాశం ఉండ‌ద‌ని, భ‌విష్య‌త్ ఆ నెల‌లో వ్య‌వ‌సాయం చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని వెల్ల‌డించారు..

చైనా అగ్రో టెర్ర‌రిజానికి ప్లాన్…
చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్‌ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్‌ను ప్రయోగిస్తోందా? అంటే.. అవునంటోంది అమెరికా.. ఇప్పటికే చైనా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్‌ మెట్రోపాలిటిన్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.. చైనా కమ్యూనిస్టు పార్టీకి సైంటిస్ట్‌ జియాన్‌ విధేయురాలు .. ఈ ఫంగస్‌పై పనిచేస్తున్న జియాన్‌కు కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లు వెల్ల‌డైంది. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని క‌శ్యప్‌ పటేల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్‌ చేసి.. తమ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసే కుట్ర అని తెలిపారు. ఈ ఫంగ‌స్ ప్ర‌యోగాల‌ను ఏకంగా అమెరికాలో మిచిగ‌న్ ల్యాబ్ చేసేందుకు ఈ ఇద్ద‌రు సైంటిస్ట్ లు సిద్ద‌ప‌డ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

అమెరికా గ‌రం గ‌రం..
వుహాన్‌ ల్యాబ్‌లో జరిగిన క‌రోనా సృష్టి, మళ్లీ మిషిగన్‌ ల్యాబ్‌లో రిపీట్‌ కాకూడదని అమెరికా భావిస్తోంది. అందుకే అమెరికా అలర్ట్‌ అయింది. అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్‌ను సీరియస్‌గా తీసుకుంది. అమెరికా మీడియా కూడా డ్రాగన్‌పై చిందులు తొక్కుతోంది. అసలే అమెరికాను చూసి చైనా రగిలిపోతోంది. అగ్రరాజ్యంపై కత్తులు నూరుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. చైనా ఏమైనా చేయొచ్చని అగ్రరాజ్యానికి అనుమానంగా ఉంది. ఇవన్నీ కలిసి, చైనా ఫంగస్‌పై అలారమ్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఈ ఇద్ద‌రిని ప్ర‌స్తుతం విచారిస్తున్నారు..

Leave a Reply