ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం మండల టిడిపి సీనియర్ నాయకులు,మాజీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, రోజా రాణి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగువారి ఆత్మగౌరవం,పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను, ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గూడు, గుడ్డ అనే సంకల్పంతో తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. 9 నెలల లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని కాపాడిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియా డారు.
ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒంటేరు రామారావు, సూరెడ్డి పిచ్చేశ్వరరావు, షేక్ శ్రీను, దూపగుంట్ల బాబురావు,కొప్పుల లక్ష్మీనారాయణ, కుప్పాల బాబు,ఉప్పెన కృష్ణారెడ్డి, మరీదు జమలయ్య, చోడుబోయిన తిరుపతిరావు, షేక్ తిరుపతిరావు, కుప్పాల వెంకటేశ్వరరావు, తుళ్లూరు కృష్ణ, మల్లాది చంటి, షేక్ షరీఫ్, వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉత్సాహవంతులైన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు.
