రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…

రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…
విజయవాడ అభివృద్ధి నిరోధకులు దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు
కరోనాకి కూడా కులం అంటగట్టిన దిగజారుడు పార్టీ వైసిపి
ప్రజా రాజధాని అమరావతిని చూసి వైసిపి ఓర్వలేకపోతోంది
విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అడ్డంకి వైఎస్ఆర్సిపి పార్టీ నే అని తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ అన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజధాని విషయంలో ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ అంటూ అవినాష్ మాట్లాడిన మాటలు సిగ్గుచేటు అన్నారు.
విజయవాడ మెట్రో నగరంగా అభివృద్ధి చెందాల్సి ఉందని, కేవలం దేవినేని అవినాష్ కుటుంబ సభ్యుల రౌడీయిజం కారణంగానే విజయవాడ నగరం అంటే రౌడీయిజం అనే పేరు వచ్చి నగరం అభివృద్ధి చెందలేదు అన్నారు. నగర అభివృద్ధికి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులే కారణం అని చెప్పారు. రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ గా , రౌడీయిజానికి ఊపిరి పోసిన కుటుంబంలో ఉన్న దేవినేని అవినాష్ విజయవాడ నగర అభివృద్ధికి చంద్రబాబు, లోకేష్ కారణం అంటూ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు డిపార్చర్, ఎరైవల్ గా ఉండే దేవినేని అవినాష్కు అంతకంటే ఏమి తెలుసు అంటూ ఎద్దేవా చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై మావి గన్ అంటూ మాట్లాడుతున్నాడని, వైకాపా నాయకులు ప్రచారంలోకి తెచ్చిన ‘మావి’ అనే పేరుపై సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోందన్నారు. మావిగన్ అంటే మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని అవినాష్ గురించే నా అనే సందేహం ప్రజల్లో నెలకొందన్నారు. ఎం అంటే విజయవాడ ఎంపీగా ఒకసారి, వి అంటే విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఒకసారి, జి అంటే గుడివాడ ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసి మూడుసార్లు కూడా ఓడిపోయిన అవినాష్ గురించేనా జగన్ మావిగన్ అనే పేరు పెట్టింది అనే సందేహం నెలకొంది అన్నారు. కనీసం కార్పొరేటర్ గా కూడా అవినాష్ గెలవలేదని అతనికి రాజకీయ పరిజ్ఞానం ఏమి ఉంటుందని ప్రశ్నించారు.
అందుకే వైసిపి జగన్మోహన్ రెడ్డి సైతం ఏరైవల్ డిపర్చరు గాని దేవినేని అవినాష్ ను వాడుతున్నాడని తెలిపారు. విజయవాడ నగరం అభివృద్ధి పథంలో నడుస్తుందంటే టిడిపి కూటమి ప్రభుత్వమే కారణమన్నారు. విజయవాడ విమానాశ్రయం ఎంత బాగా అభివృద్ధి చెందిందో ఎరైవల్ డిపార్చర్ గా ఉన్న నీకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే పార్టీ వైసిపి అని చరణ్ సాయి యాదవ్ తెలిపారు. కరోనా సమయంలో సైతం కులాలు అంటగట్టిన దిగజారుడు పార్టీ వైసిపి అన్నారు. కమ్మ కులస్తులకు వెన్నంటి ఉన్న పార్టీ వైసీపీ అంటే అందరూ నవ్వుతున్నారని, విజయవాడలో కొందరు కమ్మ కులస్తులపై వైసిపి పాలనలో జరిగిన దాష్టకం అందరికీ తెలుసు అన్నారు.
వైద్యులు మొదలుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన దిక్కుమాలిన చరిత్ర వైసిపి ప్రభుత్వాన్నిదని అన్నారు. దేవినేని అవినాష్ ఒక్కసారైనా రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడతాడని నగర ప్రజలు ఎదురు చూస్తుంటే, ప్రతిసారి కూడా ప్రజలకు నిరాసే ఎదురవుతుందని, కనీస రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అన్నారు. రాజకీయాలద్దీ కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే వైసీపీ నాయకులకు త్వరలోనే రాష్ట్ర ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారని, 11 రెడ్డిగా ఉన్న జగన్ రెడ్డిని జీరో రెడ్డి చేస్తారని చరణ్ సాయి తెలిపారు.
ప్రజా రాజధాని అమరావతి విషయంలోనూ, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్ గురించి దేవినేని అవినాష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. అవినాష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అతనికె మంచిదని ఎతువు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, విద్యార్థి నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.
