ఆసుపత్రుల వ్యర్థానికి చెక్

  • మొక్కలు నాటి… గోడలకు వాట్ వాష్ .. భళా
  • శ్రీకాకుళంలో ఏక్ దిన్..ఏక్ సాథ్.. సూపర్

( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో ): నాగావళి (Nagavali) వంతెన ఇరు వైపులా ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్వచ్చోత్సవ్ లో భాగంగా పండిట్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి (Pandit Dayal Upadhyaya Jayanti) సందర్భంగా ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాథ్.. పేరుతో గురువారం డే అండ్ నైట్ నాగావళి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త, కాలులోని పూడికలు తీసే కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. వంతెన పరిసర ప్రాంతాలలో ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేస్తున్నారని, దీని వలన నది కలుషితం అవుతోందని, పర్యావరణానికి హాని తప్పదన్నారు.

వంతెనకి ఇరువైపులా ఎటువంటి చెత్త, ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్చతకు సంబందించి ఆయన మున్సిపల్ ఆరోగ్య శాఖ (Municipal Health Department) అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పరిశుభ్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు.

అందరూ పరిశుభ్రతను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. తీరప్రాంతంను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వంతెన గోడలకు కలెక్టర్ (Collector) వైట్ వాష్ వేశారు. అనంతరం ఆయన వంతెన వద్ద మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, మున్సిపల్ హెల్త్ అధికారి సుధీర్, మున్సిపల్ ఇంజనీర్ బి.శ్రీనివాసులు, అసిస్టెంట్ ఆర్టికల్చర్ అధికారి ప్రసాద్, పాల్గొన్నారు.

Leave a Reply