అధిక ధరలకు బ్రేక్

సూపర్ జీఎస్టీతో.. సూపర్ సేవింగ్స్

కర్నూలు బ్యూరో, సెప్టెంబర్ 27, ఆంధ్రప్రభ : క‌ర్నూలు (Kurnool) నగరంలోని జ్యోతి మాల్‌లో శనివారం సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ (Super GST – Super Savings) అంశంపై వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ టాక్స్ (Commercial Tax), సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జీఎస్టీ పన్నుల తగ్గింపు, వినియోగదారులకు లభించే ప్రయోజనాలపై స్పష్టతనిచ్చేలా అధికారులు సమగ్రంగా వివరణ ఇచ్చారు. నకిలీ బిల్లులు (Fake Bills), అధిక ధరలకు వస్తువుల విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా అవగాహన కల్పించారు. సదస్సులో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ రఘువీర్, కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తూ, నూతన జీఎస్టీ విధానాలపై వివరించిన అధికారులు, ప్రజల సహకారంతో వ్యాపారాలలో పారదర్శకత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

Leave a Reply