Nomination | మారిన నామినేషన్ కేంద్రం..

Nomination | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్ పూర్, అచ్చయపల్లి గ్రామాలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు చేయడానికి నామినేషన్ కేంద్రం మారడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్ వేయడానికి 15 కిలోమీటర్ల దూరంలో ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆయా గ్రామాల అభ్యర్థులు వెళ్ళడానికి అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి జలాల్ పూర్, అచ్చయపల్లి గ్రామాల మధ్య దూరం సుమారు 15 కిలో మీటర్లు ఉంటుంది. అంత దూరంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నామినేషన్ కేంద్రానికి చేరుకోవాలంటే ఎదో ఒక వాహనాన్ని ఆశ్రయించవలసి వస్తుందని అంటున్నారు. గతంలో జలాల్ పూర్ లోనే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. కాగా.. ఒక్కో నామినేషన్ కేంద్రంలో 40 మంది వార్డు సభ్యులకు లోపు నామినేషన్ వేసేలా అవకాశం కల్పించినట్టు తెలిసింది.అదే రీతిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిసింది.కానీ దగ్గరలో అన్ని వసతులున్న పంచాయతీలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే అందరికి అనుకూలంగా ఉండేదని ఆయా గ్రామస్తులు అంటున్నారు.

అలాగే మండలం లోని జప్తి జానకంపల్లి, మెల్లకుంటా తండా గ్రామాల అభ్యర్థులు కూడా ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలోనే నామినేషన్లు సమర్పించవలసి ఉంటుంది. ఈ రెండు గ్రామాలు కూడ ఎంపిపి కార్యాలయానికి మధ్య దూరం9 కిలోమీటర్ల వ్వరకు ఉంటుంది.ఈ గ్రామాల అభ్యర్థులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాలను మార్చడంతో 15 కిలోమీటర్ల దూరం వచ్చి నామినేషన్లు వేయవలసి వస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు మండల కేంద్రానికి రావడం,వెళ్లడం 15 కిలోమీటర్ల దూరబారం పెరగడం తో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply