మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం

మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం
తొర్రూరు, ఆంధ్రప్రభ : ద్వి చక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తామని మత్తు పదార్థాలకు గంజాయి సేవానానికి దూరంగా ఉంటామని తొర్రూర్ పట్టణ పదవ వార్డ్ కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో వార్డు లో ఉన్న యువతతో కలిసి తొర్రూర్ ఎస్సై కి తీర్మానపత్రం అందజేశారు. బుధవారం రాత్రి పోలీస్ వారు, ఎస్సై వార్డు ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పించారు . ఎస్ఐ సూచనలు తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు.

నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలోవార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ తో పాటు సభ్యులు ఎస్. భాస్కర్ రెడ్డి, జంపయ్య, అక్షయ, ప్రణీతు, సాయి ,తోట సంపత్, సి.హెచ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు
