క్లీన్ అండ్ గ్రీన్‌లోనే మార్పు
- ప్రకాశం ఎస్పీ ప్రయోగం
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే మందుబాబుల(Drug addicts)ను సరిదిద్దేందుకు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు(SP V. Harshavardhan Raju) వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జిల్లా క్లీన్ అండ్ గ్రీన్(Clean and Green)…. ప్రజలు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదంతో పోలీసులు(Police) ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మందుబాబుల కోసం బహిరంగ ప్రదేశాలు(Public Places) సిద్ధం అంటూ గుణపాఠం చెప్పేందుకు కొత్త బాటలు వేశారు.
మద్యం సేవించి అల్లరి చేసే వారిని పట్టుకున్నపోలీసు సిబ్బంది.. మత్తు దిగేవరకు బహిరంగ ప్రదేశాల్లోనే ఉంచుతున్నారు. అంతేకాదు, ఆ ప్రదేశంలో ఉన్న చెత్తను వారితో శుభ్రం(Cleaning) చేయించి, సేకరించిన వ్యర్థాలను తగలబెట్టిస్తున్నారు. మీ చెడు అలవాట్లు కూడా ఈ నిప్పుల్లో(Fires) కాలి పోవాలి అన్నబోధనతో కౌన్సిలింగ్ అందిస్తున్నారు. వ్యసనాలకు బానిసైపోతే కుటుంబాలు దెబ్బతింటాయని, పిల్లల బంగారు భవిష్యత్ చీకట్లో కలిసిపోతుందని పోలీసులు మందుబాబులకు సూచిస్తున్నారు.
వారి ప్రవర్తన వల్ల పిల్లల కలలు కలలుగానే మిగిలిపోతే అది క్షమించరాని నేరమని అధికారులు(Officers) హెచ్చరిస్తున్నారు. మొదటి తప్పు చేసినవారికి కౌన్సిలింగ్(Counseling)తో పాటు పరిసరాలను శుభ్రం చేసే అవకాశం ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మత్తు(Intoxication)లో ఇబ్బందులు పెట్టే వారిపై డ్రోన్ కెమెరాల ద్వారా కఠిన నిఘా ఏర్పాటు చేశారు.
అసాంఘిక చర్యలకు ఉపేక్ష లేదు
మహిళలను అల్లరి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగించే మందుబాబులను జిల్లా వ్యాప్తంగా ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.
