Chandrasekhar | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Chandrasekhar | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
- పారిశుద్ధ్య పనులు తనిఖీ
Chandrasekhar | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి, ఆయా వార్డు ప్రజలతో మాట్లాడి మున్సిపాలిటీ నుండి ఉన్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని తెలుసుకున్నారు.
వార్డు నెంబర్–28 (శ్రీకృష్ణ నగర్) లో ఆయన పర్యటించి వార్డు ప్రజలతో మాట్లాడారు. పారిశుధ్యం, మురికి కాలువల పరిశుభ్రతను ప్రత్యక్షంగా ఆయన పరిశీలించారు. డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో చెత్త వేస్తే కఠినంగా జరిమానాలు విధించాలని మునిసిపల్ కమిషనర్‌కు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. మోతికుంట బండ్ పునరుత్తేజానికి చర్యలు ప్రారంభించనున్నట్లు హామీ ఇచ్చారు. అమృత్–2 పథకం కింద మోతికుంట బండ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మునిసిపాలిటీలో చేపడుతున్న పారిశుధ్య అభివృద్ధి పనులను మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కలెక్టర్ కు వివరించారు.
