న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈరోజు (బుధవారం, జూలై 16న) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman)తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యటన(On a two-day visit to Delhi)లో భాగంగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు(Development works), పోలవరం ప్రాజెక్టు(Polavaram project), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్రం నుంచి అదనపు నిధుల (Additional funding) కోసం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (State Finance Minister Payyavula Keshav) కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఆర్థిక నష్టాలను 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మరింత మద్దతు అందించాలని ఆయన కోరారు.
ముఖ్యంగా, రాయలసీమ ప్రాంతాన్ని కరవు నుంచి కాపాడేందుకు కేంద్రం మద్దతు (Centeral govt. support) అందించాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister for Civil Aviation Kinjarapu Rammohan Naidu), ఇతర తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీలు కూడా పాల్గొన్నారు.