Chandrababu | ఏపీలో ‘ముస్తాబు’

Chandrababu | ఏపీలో ‘ముస్తాబు’
Chandrababu | తాళ్లపాలెం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లా (Anakapalle District) తాళ్లపాలెంలోని గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ ‘ముస్తాబు’ (వ్యక్తిగత పరిశుభ్రత) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో సమావేశమైన సీఎం చంద్రబాబు (Chandrababu) వివిధ అంశాలపై చర్చించారు.
పిల్లల బంగారు భవిష్యత్తు (Golden future) నా బాధ్యత.. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో శనివారం నుంచి ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శుభ్రత, ఆరోగ్య అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు (Teachers and students) పాల్గొన్నారు. మరోవైపు చంద్రబాబు తాళ్లపాలెంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కాలినడకన వెళ్లి గ్రామంలో స్వచ్ఛత పనులను పరిశీలించారు.
