Chandrababu | అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ

Chandrababu | అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ
Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశంలో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాంతాలు, కులాలతో రాజకీయం చేస్తే గెలవలేమన్నారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… వెయ్యి మంది సైకోలు వచ్చిన అమరావతి ఆగదన్నారు. అమరావతి విషయంలో న్యాయం.. ధర్మం.. చట్టం గెలిచిందన్నారు.
ఆనాడు హైదరాబాద్ ను డెవలప్ చేశా… ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నానన్నారు. అన్నీ ఆలోచించే రాజధానికి అమరావతి పేరు పెట్టానన్నారు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి అన్నారు. ఆనాడు బాబాయ్ ను చంపేసి… ఆ నేరం తనపై వేశాడన్నారు. అమరావతిపై జగన్ కక్ష్యగట్టారన్నారు. అమరావతి అజేయంగా ముందుకు వెళ్తుందన్నారు. ఆనాడు ఆడబిడ్డలను వేధించారన్నారు. డ్రోన్లతో ఆడబిడ్డలను వీడియో తీశారన్నారు.. లాఠీలతో కొట్టించారన్నారు.
అమరావతే రాష్ట్ర రాజధాని అని కేంద్రం చట్టం చేసిందన్నారు. రాజధాని అమరావతికి కేంద్రం రాజముద్ర వేసిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమం కోసం సూరేపల్లి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. 16 వేలకుపైగా గ్రామాల్లో ఇంకా రీసర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. భూ రికార్డులు ట్యాంపర్ కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామని, పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఇచ్చామని, రికార్డులు డిజిటల్ లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
