ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ దాయాదుల పోరు హోరాహోరీగా సాగుతోంది. కాగా, కీలకమైన హైవోల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్… టీమిండియా పటిష్ట బౌలింగ్ కు 241 పరుగులు చేసి ఆలౌటైంది.
భారత బౌలర్ల ధాటికి.. పాకిస్థాన్ బ్యాటర్లంతా పెవిలియన్ క్యూ కట్టారు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
అయితే పాక్ బ్యాట్స్‌మెన్లలో సౌద్ షకీల్ (76 బంతుల్లో 5 ఫోర్లతో 62) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 3 ఫోర్లు 46), ఖుష్దిల్ షా (39 బంతుల్లో 2 సిక్సర్లు 38) ఆకట్టుకున్నారు. అయితే వీరు తప్ప మరెవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు.
కాగా, సెమీస్ బెర్త్ లక్ష్యంగా 242 పరుగుల టార్గెట్ తో టీమిండియా బరిలోకి దిగనుంది.