Champions Trophy | స‌గ‌ర్వంగా ఐదోసారి ఫైన‌ల్స్ కు భార‌త్ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీ లో భార‌త జ‌ట్టు స‌గ‌ర్వంగా ఐదోసారి షైన‌ల్స్ కు చేరింది. నేడు జ‌రిగిన తొలి సెమీస్ లో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ విజ‌యం సాధించిన టీమిండ‌యా… 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది.

కాగా, భార‌త జ‌ట్టు విజ‌యంలో కింగ్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. 5వ ఓవ‌ర్లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ (84) ప‌రుగులు సాధించి 43వ ఓవ‌ర్లో ఔట‌య్యాడు. ఇక మిడిలార్డ‌ర్ లో శ్రేయ‌స్ అయ్యర్ (45), అక్ష‌ర్ ప‌టేల్ (27) రాణించారు.

కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్ లు 28) ధనాధన్ బౌండరీలతో టీమ్ ఇండియాను విజయతీరాలకు ద‌గ్గ‌రచేశారు. అయితే, హార్ధిక్ పాండ్యా ఔట‌న త‌రువాత జ‌డేజా (2) క్రీజులోకి రాగా.. ఇక‌ 49వ ఓవ‌ర్ తొలి బంతికి విన్నింగ్ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

నాథన్ ఎల్లిస్, ఆడమ్ జాంపా రెండేసి వికెట్లు తీయ‌గా… బెన్ ద్వార్షుయిస్, కూపర్ కొన్నోలీ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇక ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది ఎడిషన్‌లు జరగ్గా.. 2002, 2013లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్.. 2000, 2017లో రన్నరప్‌గా నిలిచింది. ఇక నేటి తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు చేరడం ఇది ఐదోసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *