దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ పడింది. ఇండియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్… నాలుగో వికెట్ కోల్పోయింది. వరుస ఓవర్లలో స్పిన్ అటాక్ కు మూడు వికెట్లు కోల్పోయిన కివీస్.. ఇప్పుడు నాలుగో వికెట్ కోల్పోయింది.
విధ్వంసకర ఓపెనర్లు విల్ యంగ్ (15), రచిన్ రవీంద్ర (37), కేన్ విలియమ్సన్ (11) పెవిలియన్ చేరగా.. తరువాతి బ్యాట్స్ మెన్ డారిల్ మిచెల్ (22), టామ్ లాథమ్ (14) నిలకడగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో, 23.2వ ఓవర్లో జడేజా వేసిన బంతితో టామ్ లాథమ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (22) – గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. న్యూజిలాండ్ 23.2 ఒవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసింది.