సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా…

సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నా బావమరిది, నా తమ్ముడిపై రేవంత్ ఆరోపణలు చేశారు. మీ తమ్ముడు చేసిన అవినీతి, నీ బావమరిది అమృత్ టెండర్లు, సింగరేణిలో అవినీతిపై కమిటీ వేసేందుకు నీవు సిద్దమైతే, నేను సిద్ధమే అని హరీష్ రావు స్పష్టం చేశారు.హౌస్ కమిటీ వద్దు, సీబీసీఐడీ వద్దు, సిట్టింగ్ జడ్జితో విచారణకు రావడానికి దమ్ముందా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి అంశం నుంచి డైవర్షన్ కోసం మా మీద బురద జల్లుతున్నారు. మీరు ఎటువంటి తప్పు చేయకుంటే, విచారణకు రావాలని సవాల్ విసిరారు.
మీ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల టెండర్లు పొంగులేటికే ఇచ్చావు. అలాగే, నీ కలల ప్రాజెక్ట్ మూసీ పునరుద్ధరణ మంత్రి పొంగులేటికి ఇచ్చారు. అందుకే పొంగులేటిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నావని విమర్శించారు. 20 స్కామ్‌లపై విచారణకు మేము లేఖ రాశాం. సీఎం రేవంత్‌కు దమ్ముంటే వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
