Challapally | భక్తులకు మజ్జిగ పంపిణి

Challapally | భక్తులకు మజ్జిగ పంపిణి

Challapally | చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లిలో నూతనంగా ప్రారంభించనున్న గ్రావిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ శిబిరాన్ని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మోర్ల రాంబాబు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, కో ఆప్షన్ సభ్యులు షేక్ నబీ ఘోరీ, కొడాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇబ్రహీం, దుర్గాలతోపాటు విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply