Challapalli | మాజీ జడ్పీటీసీ ముత్యాల చిట్టబ్బాయ్ కన్నుమూత

Challapalli | మాజీ జడ్పీటీసీ ముత్యాల చిట్టబ్బాయ్ కన్నుమూత

Challapalli | చల్లపల్లి, ఆంధ్రప్రభ : అందరిచేత బాబాయ్ అని ఆప్యాయంగా పిలిపించుకునే ముత్యాల వెంకటరత్నం అలియాస్ చిట్టబ్బాయ్ (80) ఈ రోజు ఉదయం చల్లపల్లిలోని నివాసంలో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా సుదీర్ఘ కాలం వర్క్ చేసిన ఆయన మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. టీడీపీలో ప్రముఖ నాయకుని పై పోటీ చేసి జడ్పీటీసీగా విజయం సాధించటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. గత కొన్నేళ్లుగా వైసీపీ నాయకునిగా కొనసాగుతున్న చిట్టబ్బాయ్ జిల్లా స్థాయి పదవిలో ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. భౌతికకాయాన్ని స్వగ్రామం మోపిదేవి మండలం మెరకనపల్లి తీసుకువెళ్లారు. అంత్యక్రియలు అక్కడే జరుగనున్నాయి.

Leave a Reply