Chaitanya – Raviteja | తెర వెనుక ఏం జరిగింది..?

Chaitanya – Raviteja | తెర వెనుక ఏం జరిగింది..?
Chaitanya – Raviteja | నాగచైతన్య కోసం సిద్ధమైన కథ ఎలా రవితేజ దగ్గరకు వెళ్లింది..?
శివ నిర్వాణ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు ఎందుకు జరిగాయి..?
ఇరుముడి’ పోస్టర్‌తో పెరిగిన బజ్.. విక్రమార్కుడు సెంటిమెంట్ టాక్
తండ్రి పాత్ర కారణంగానే చైతూ నో చెప్పాడా..?
రవితేజకు ‘ఇరుముడి’ హిట్ అవుతుందా..?
Chaitanya – Raviteja | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒకరి కోసం కథ రాయడం.. ఆ కథ వేరే హీరో దగ్గరకు వెళ్లడం అనేది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు.. నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాగే జరిందట. నాగచైతన్య (Nagachaitanya) కోసం కథ రాస్తే.. అది రవితేజ దగ్గరకి వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే.. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే చైతూ ఎందుకు నో చెప్పాడనే దానికి కూడా ఓ కారణం వినిపిస్తోంది. ఇంతకీ.. చైతూ ఎందుకు నో చెప్పాడు..? రవితేజ ఎందుకు ఎస్ చెప్పాడు…? ఇద్దరిలో ఎవరు కరెక్ట్..?
Chaitanya – Raviteja | మార్పులు చేర్పులు..
నాగచైతన్యతో సినిమా చేయాలని డైరెక్టర్ శివ నిర్వాణ కథ రెడీ చేశాడు. స్టోరీ లైన్ (Story Line) చెబితే.. బాగుందని ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పాడు. ఇక అక్కడ నుంచి శివ నిర్వాణ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది.. నెరేట్ చేస్తే.. మార్పులు చేర్పులు చెప్పారు. మళ్లీ నెరేషన్ ఇవ్వడం.. మార్పులు చెప్పడం ఇలా జరుగుతే ఉందట. అయితే.. ఈలోపు చైతన్య వేరే కథలు కూడా విని ఓకే చేసారు. ఇక వెయిట్ చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాడో ఏమో కానీ.. డైరెక్టర్ శివ నిర్వాణ వేరే ప్రయత్నాలు ప్రారంభించారు.

Chaitanya – Raviteja | విక్రమార్కుడు తరహా సెంటిమెంట్..?
చైతన్య కోసం రాసిన కథనే రవితేజకు చెప్పాడని… కథ విని ఆయన వెంటనే ఓకే చెప్పడం.. ఆతర్వాత ప్రాజెక్టును అనౌన్స్ చేయడం తెలిసిందే. అదే.. ఇరుముడి. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడుగా నటిస్తుండడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఇందులో రవితేజకు ఓ కూతురు కూడా ఉంది. లేటెస్ట్ గా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కూడా చిన్నారితో రవితేజ (Raviteja) కనిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే.. విక్రమార్కుడు సినిమాని గుర్తు చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో రవితేజతో చైల్డ్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ ని గుర్తు చేసేలా సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Chaitanya – Raviteja | తండ్రి పాత్రలో రవితేజ..?
ఇరుముడి నుంచి కొత్త పోస్టర్ బయటకు వచ్చిన తర్వాత.. ఈ కారణం వలనే నాగచైతన్య ఇంట్రెస్ట్ చూపించలేదా అంటూ ప్రచారం జరుగుతుంది. మేటర్ ఏంటంటే.. ఈ కథలో హీరోకు ఓ కూతురు ఉంది. యంగ్ హీరోగా ఉన్న నాగచైతన్య.. ఓ కూతురు ఉన్న తండ్రి క్యారెక్టర్ చేయడం ఇష్టం లేకనే ఈ కథకు ఓకే చెప్పలేదా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. తెర వెనుక ఏం జరిగిందో క్లారిటీ లేదు కానీ.. ఇరుముడి మాత్రం మాస్ (Mass) మహారాజాకు మంచి విజయం అందిచేలా ఉందనే టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. చైతన్య కోసం రాసిన కథ ఇదేనా… కాదా…? ఇదే అయితే కనుక ఎవరు కరెక్ట్ అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

