సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా

సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా

  • చైర్ పర్సన్ అభ్యర్థి దొంత అంజలి – నర్సయ్య

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి నిరంతరం పని చేస్తానని కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి దొంత అంజలి-నర్సయ్య ఓటర్లకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 2 వ వార్డ్ లో సుమారు 150 మంది కార్యకర్తలతో ప్రచారాన్ని హోరేత్తించారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వివరించారు. 2 వ వార్డ్ ఓటర్లు కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.మున్సిపాలిటీతో పాటు ప్రత్యేకంగా 2 వ వార్డ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.వీధి దీపాలు, డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, పెన్షన్స్, రైతు భరోసా అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోందని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మాణం ద్వారా మన మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తాను చైర్ పర్సన్ గా ఎన్నికైతే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాయకునిగా కాకుండా సేవకునిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply