Chairman | డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం!

Chairman | డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం!

రెండున్నర–రెండున్నర ఫార్ములా ఖాయం?.. విశ్వసనీయ వర్గాల్లో చర్చ

Chairman | డోర్నకల్, ఆంధ్రప్రభః మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ చైర్మన్ పీఠంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండున్నర ఏండ్లు ఒకరు, మిగతా రెండున్నర ఏండ్లు మరొకరు చైర్మన్ పదవిని చేపట్టనున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఎల్లావుల సువర్ణ హరికృష్ణ, గారే రమేష్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైస్ చైర్మన్‌గా మాదా లావణ్య శ్రీనివాస్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పట్టణ రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply