Centuries | విశ్వాసానికి ప్రతీకగా…

Centuries | విశ్వాసానికి ప్రతీకగా…
Centuries | తీర్యాణి, ఆంధ్రప్రభ : దట్టమైన అడవుల నడుమ, ఎత్తైన కొండలపై విశాలమైన మైదాన ప్రాంతంలో బిల్వవనం మధ్య వెలసిన గుడిపేట గుట్ట శివాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. గోండు పాండుగా చెప్పుకునే కాలంలో గోండు వాన రాజ్యంలో అనేక దేవాలయాలు నిర్మించబడగా, వాటిలో ఒకటైన ఈ పురాతన శివాలయం శతాబ్దాల చరిత్రను మోస్తోంది. ఈ ఆలయంలో శివ పంచాయతన విగ్రహ సముదాయం ప్రత్యేక ఆకర్షణ. పరమశివుడు, పార్వతీ దేవి, గణపతి, ఆదిశేషుడు, సూర్యదేవుడు, నందేశ్వరుడు సమేతంగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడి శిల్ప సౌందర్యాలు చెక్కుచెరగని వైభవాన్ని తెలియజేస్తాయి.
స్థానిక విశ్వాసం ప్రకారం, ఆదిశంకరుడు కోరుకున్న కోరికలు నెరవేర్చే ఈ స్వామి, భక్తులకు భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం. ఎత్తైన కొండల మధ్య తియ్యని నీరు కలిగిన పుష్కరిణి ఈ ఆలయానికి మరింత పవిత్రతను అందిస్తోంది. గుడి దక్షిణ వైపున ఉన్న పురాతన ఆవుల టేట్లు, నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం ప్రత్యేక విశేషం. ఈ పవిత్ర క్షేత్రానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర రాష్ట్రం నుంచీ, చుట్టుపక్కల గ్రామాల నుంచీ వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడ భారీగా జాతర జరుగుతుంది. ఈ గుడిపేట గుట్ట శివాలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు… చరిత్ర, శిల్పకళ, ప్రకృతి అందాల సమ్మేళనంగా నిలిచిన మహావిశేషo నిలిచాయి
పూజారి భగవంతురావు ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ ఎస్ పార్వతి రావు భీమ్రావు కాశిరాం సర్పంచ్ తులసి వెంకటరావు,ఉపసర్పంచ్ నాందేవ్ తదితరులు కార్యనిర్వాహన కమిటీ వారు నడిపిస్తున్నారు.
