centers | కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం

centers | కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం

  • మండలంలో 91.28 పోలింగ్ శాతం నమోదు
  • సరిపోని వీల్ చైర్స్, గదులతో ప్రజల ఇబ్బందులు
  • ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్

centers | కొత్తూరు, ఆంధ్రప్రభ : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొత్తూరు మండలంలో నిర్వహించిన రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం(Elections are peacefulగా ముగిశాయి. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆతర్వాత పోలింగ్ ఊపందుకుంది.

కొత్తూరు మండలంలో మొత్తం 12 గ్రామపంచాయతీలలో మొత్తం 16813 ఓటర్లు ఉండగా అందులో 15346 మంది పోలింగ్ లో పాల్గొనగా 7734 పురుషులు, 7622 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తంగా 91.28 పోలింగ్ శాతం నమోదైందని అధికారులు తెలిపారు.

సరిపోని వీల్ చైర్స్, గదులతో ప్రజల ఇబ్బందులు….

మండలంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చేటువంటి రోగులు , వయోవృద్ధులు, వికలాంగుల(disabled)కు సరైన సదుపాయాలు కల్పించకపోవటంతో వారు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో సైతం ఓటు వేసేందుకు వచ్చేటువంటి రోగులు , వయోవృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్స్ తగిన సంఖ్యలో అధికారులు ఏర్పాటు చేయకపోవటంతో ఓటర్లు(voters) చాలా ఇబ్బందులకు గురయ్యారు.

పోలింగ్ కేంద్రాలలో ఒకే గదిలో రెండేసి వార్డుల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటంతో తమ వార్డు ఏదోనని కాస్త అయోమయానికి గురయ్యారు. అంతేకాకుండా శేరిగూడ బద్రాయ పల్లిలో గదుల కొరత ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను పాఠశాల ఆవరణలోని వరండాలలో షామియానాల్లో, వంట గదుల్లో పోలింగ్ కేంద్రాలను(centers) ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు ఇరుకు ఇరుకు గదుల్లో ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికలను నిర్వహించే అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని పలువురు ఎద్దేవ చేశారు.

Leave a Reply