హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక , ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా సమగ్ర ప్రయోజనాలను వేడుకగా జరుపుకుంటుంది. గింజలలో రాజు అయిన బాదంలో 15 ముఖ్యమైన పోషకాలు వున్నాయి. డాక్టర్ మార్క్ కెర్న్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా బాదం తినడం, వ్యాయామం తర్వాత వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
ఈ సందర్భంగా బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… తన యోగాభ్యాసాన్ని సంపూర్ణం చేసుకోవటానికి తాను కాలానుగుణ పండ్లు, కూరగాయలు, పెరుగు, బాదంపప్పులతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానన్నారు. న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… ప్రోటీన్, డైటరీ ఫైబర్, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులతో, బాదం బరువు నిర్వహణ, ఇతర పోషక అవసరాలకు మద్దతు ఇస్తుందన్నారు.
మాక్స్ హెల్త్‌కేర్ – న్యూఢిల్లీలో డైటెటిక్స్ ప్రాంతీయ అధిపతి రితికా సమద్దర్ మాట్లాడుతూ… యోగా ప్రయోజనాలను మెరుగ్గా పొందటానికి పోషకమైన ఆహారంతో దానిని పూర్తి చేయాలని సిఫార్సు చేస్తున్నాను. మీ దినచర్యలో బాదం వంటి ఆహారాలను చేర్చుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఫిట్‌నెస్, సెలబ్రిటీ బోధకురాలు యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారాలు అధికంగా ఉండే ఆహారం అంటే బాదం వంటివి ఎక్కువగా తీసుకుంటానన్నారు.
ప్రముఖ దక్షిణ భారత నటి శ్రియ శరణ్ మాట్లాడుతూ… యోగా ఎప్పుడూ వ్యాయామం కంటే ఎక్కువే. తన అభ్యాసానికి మద్దతుగా తాను బాదం వంటి ఆహారాలపై దృష్టి పెడుతుంటానన్నారు. ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ… యోగా సాధన శరీరం, మనస్సును అనుసంధానించడం తో పాటుగా సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. బాదం వంటి పోషకమైన ఆహారాలతో కలిపినప్పుడు, ఇది మొత్తం ఆరోగ్యం పెంపొందించటానికి తోడ్పడుతుందన్నారు.