CC Roads | అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం

CC Roads | అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం

  • ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
  • రూ. 90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభం

CC Roads | గన్నవరం, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లోని అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkat Rao) తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో రూ.90 లక్షలతో కొత్తగా నిర్మించిన రెండు సిమెంట్ రోడ్లను గురువారం ఉదయం యార్లగడ్డ ప్రారంభించారు.

గ్రామంలోని జాతీయ రహదారి నుంచి సీబీఎన్సీ చర్చి(CBNC Church) వరకు ఎనర్జీ ఎస్ నిధులు రూ.40 లక్షలు, గ్రామపంచాయతీ రూ.25 లక్షల నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డును, ఎస్సీ కాలనీలో జిల్లా పరిషత్ నిధులు రూ.10 లక్షలు మండల పరిషత్ నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు(Cement road)ను యార్లగడ్డ ప్రారంభించారు.

CC Roads

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అధ్వానంగా మారిన రహదారుల అభివృద్ధికి(For road development) తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే(MLA) దృష్టికి తీసుకువ‌చ్చారు.

CC Roads |సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశం.

దీనికి స్పందించిన ఆయన.. సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి న‌ర్సింహారావు, గ్రామ సర్పంచ్ సర్నాల గంగారత్నం(Gangaratnam), టీడీపీ మండల అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, టీడీపీ నాయకులు బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజీ, కోనేరు నాని, పోలిశెట్టి రమణ, పరుచూరి నరేష్(Paruchuri Naresh), కొలకలూరి కుమార్, జనసేన నాయకులు అల్లిన మహేష్, బీజేపీ నాయకులు ఫణి తదితరులు పాల్గొన్నారు.

CC Roads

click here to read AISF | ఆంధ్రప్రభ ఎఫెక్ట్..

Click Here To Read More

Leave a Reply