గూడమామడలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలలోని గూడమామడ గ్రామ పంచాయతీలో ఉట్నూర్ ఐటీడీఏ ( నిధులతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం గూడమామాడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు, ఉప సర్పంచ్ కరాడే శివాజీ లు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన వీధుల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా నాణ్యతా ప్రమాణాలతో ఈ సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. పంచాయతీలో సమస్యల పరిష్కారానికి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వారుతెలిపారు.ఈకార్యక్రమంలో గూడమామడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవ్ రావు, ఉప సర్పంచ్ కరాలె శివాజీ, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
