గుంజపడుగుకు సీబీఐ బృందం

గుంజపడుగుకు సీబీఐ బృందం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్ రావు (vamanarao) దంపతుల హత్య (Hatya) కేసులో సీబీఐ (cbi) విచారణ ప్రారంభమైంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు.
వామన్‌రావు (vamanarao) దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐ (cbi) అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు, తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సీబీఐ (cbi) అధికారు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. సీబీఐ (cbi) ఎంట్రీ తో ఏం జరుగుతుందోనని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.
