జగిత్యాల రూరల్, ఆంధ్రప్రభ : గణపతి చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలకు కుల బహిష్కరణ చేసిన సంఘటన జగిత్యాల (Jagityal) జిల్లా రూరల్ మండలం కల్లెడలో చోటు చేసుకుంది. గణేష్ చందా (Ganesh Chanda) ఇవ్వలేదని గ్రామానికి చెందిన అరుణ్, గంగ లచయ్య, అంజి,సూర్య వంశీ ల నాలుగు కుటుంబాల (Four families) ను కులం నుండి కుల పెద్దలు బహిష్కరించారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో దండోర వేయించారు.
వెలివేసిన కుటుంబాలతో ఎవరైన మాట్లాడితే 25 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఆ కుటుంబాలతో ఆ కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5వేల రూపాయలు బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే 1,116 ఇచ్చిన తర్వాతనే కొట్టాలని తేల్చి చెప్పారు. కుల బహిష్కరణ (CasteBoycott) కు గురైన బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.