ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదైంది. మధురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందంటూ శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
మధురై TVK పార్టీ కార్యక్రమంలో నటుడు విజయ్‌ని కలవడానికి వెళ్తుండగా, ఆయన బౌన్సర్లు తనను అడ్డుకుని దాడి చేశారని శరత్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. శరత్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై TVK పార్టీ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలు, బౌన్సర్ల ప్రవర్తనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్‌కి ఇలాంటి ఘటనలు ఎదురవడం ఇది మొదటిసారి కాదు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.