పేర్ని కిట్టు పై కేసు నమోదు..

పేర్ని కిట్టు పై కేసు నమోదు..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుపై కేసు నమోదు అయింది. నిన్న మచిలీపట్నంలో జరిగిన ఘటన పై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ఇనకుదురు సీఐ పరమేశ్వరరావును పరుష పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు 351(2),132,3(5) కింద కేసు నమోదు చేశారు.
