నదియా : పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ ఉదయం 7గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న ఓ కారు కాంథాలియా ప్రాంతానికి సమీపంలోని కృష్ణనగర్-కరీంపూర్ రాష్ట్ర రహదారిపై బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నారు. వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
West Bengal | బస్సును ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి
