Car collision | రోడ్డు ప్రమాదం…
Car collision | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తాళ్ల పద్మావతి కళాశాల(Talla Padmavati College) సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కారులోని బెలూన్ ఓపెన్(Balloon Open) కావడంతో డ్రైవర్ కు, అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం కాలేదు.
కారులో నలుగురు ప్రభుత్వ టీచర్లు(Government Teachers) ఉన్నారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది.. సమాచారం అందుకున్న వెంటనే మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం దెబ్బతిన్నది.

